telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాష్ట్రపతి

Ram Nath Kovind

తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఫలితాల్లో దొర్లిన తప్పుల కారణంగా పలువురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యల పై నివేదిక అందించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఈ మేరకు ఆదేశాలందాయి.

ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ 27 మంది విద్యార్ధుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్లో జరిగిన విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయంటూ ఇంటర్ బోర్డు అధికారులే అంగీకరించిన విషయం విదితమే. కాగా సాఫ్ట్‌వేర్‌లో లోపాలుండడంతో సమస్యలు తలెత్తాయని, ఓఎంఆర్ షీట్ల జంబ్లింగ్ సరిగా జరగలేదని, కొందరు విద్యార్ధులకు ప్రాక్టికల్ మార్కులు నమోదు కాలేదని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Related posts