telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక వ్యాఖ్యలు…

Modi Mask

భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈరోజు అఖిల పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని పేర్కొన్నారు. అత్యంత చౌకైన, అలానే సేఫ్ అయిన కరోనా వ్యాక్సిన్ మీద ప్రపంచమంతా దృష్టి పెట్టిందని అందుకే అందరూ ఇండియా వైపు ఆశగా చూస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. అంతే గాక మరి కొద్ది వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందని ఆయన ప్రకటించారు. మన శాస్త్రవేత్తలు సరే అన్న వెంటనే ఇండియాలో వాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ముందుగా కోవిడ్ వారియర్స్ అలానే సీనియర్ సిటిజన్లకు ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన ప్రకటించారు.. ఇక ఈ కరోనా వ్యాక్సిన్ ధర విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని ఒక నిర్ణయానికి వచ్చిన వెంటనే ధర ఫిక్స్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాక్సిన్ ను ఎలా పంపిణీ చేయాలి అనే విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని ఆయన అన్నారు. అలాగే మన పంపిణీ వ్యవస్థ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం భారత్ కి అనుభవంతో పాటు మంచి నెట్వర్క్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

Related posts