తన గన్ మెన్ కు శుక్రవారం నాడు కరోనా సోకినట్టు తేలిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. దీంతో తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నానని రాజా సింగ్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “నిన్న నా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నేను, నా కుటుంబీకులు, సన్నిహిత కార్యకర్తలు టెస్ట్ చేయించుకున్నాము.
మరో రెండు రోజుల్లో రిపోర్టులు రావచ్చు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, ఆయుష్ మంత్రాలయ గైడ్ లైన్స్ పాటించాలని కోరుతున్నా” అని ఆయన ట్వీట్ చేశారు. తాను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.