telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ కొత్త మున్సిపాలిటీ బిల్లు ఆమోదం..చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే!

KCR cm telangana

తెలంగాణ అసెంబ్లీ లో కొత్త మున్సిపాలిటీ బిల్లు, పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది.

నూతన మున్సిపల్ చట్టంలోని ముఖ్యాంశాలు..

-75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయి మాత్రమే.
-75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను రూ. 100
-కార్యాలయానికి రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి.
-500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి.
-యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి.
-ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు.
-తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే 25 రెట్ల జరిమానా.
-అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత.
-పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ.
-కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు.
-హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులు ఉద్యోగాల నుంచి తొలగింపు.
-బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు
-మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, చైర్‌పర్సన్‌ల పదవులు తొలగింపు.

 

Related posts