telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చైతన్యతో నిహారిక పెళ్ళి ఎవరు కుదిర్చారంటే ?

Niharika

మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగాభిమానులు చైతన్య గురించి తెగ ఆరాలు తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిహారికది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తోంది. మెగాస్టార్ ఫ్యామిలీకి, జొన్నలగడ్డ కుటుంబానికి మధ్య ఎప్పట్నుంచో స్నేహం ఉందట. గతంలో చైతన్య తాత, చిరంజీవి తండ్రి మంచి స్నేహితులట. అందువల్ల చిరంజీవి దగ్గరుండి ఈ వివాహాన్ని ఫిక్స్ చేశారట. నిహారిక, చైతన్య కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారట. నిహారిక, చైతన్య నిశ్ఛితార్థం ఈ ఏడాది ఆగస్టులో, వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందని తెలుస్తోంది.

Related posts