telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తప్పుగా అర్థం చేసుకున్నారు.. మేము డేటింగ్ లో లేము… : దంగల్ భామలు

Dangal

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన “దంగల్” సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా. కొద్ది కాలం క్రితం వీరి బంధం హాట్ టాపిక్‌గా మారింది. సనాతో ఫాతిమా డేటింగ్‌లో ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ వార్తల గురించి తాజాగా ఫాతిమా స్పందించింది. “సనా, నేను మంచి స్నేహితులం. మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామంటూ వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాం. మా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు” అని ఫాతిమా వివరణ ఇచ్చింది. సన్య పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఇష్టపడుతుందదని, పని పట్ల చాలా అంకితభావంతో ఉంటుందని, ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను” అని ఫాతిమా చెప్పింది.

Related posts