telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ముగ్గురు హీరోల చేతులు మీదుగా శ్రీకారం ట్రైలర్…

హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. 14రీల్స్ పతాకంపై రాం అచంట, గోపీ అచంట నిర్మిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇలా ఉండగా.. ఈ సినిమా నుండి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను ముగ్గురు హీరోలతో లాంచ్ చేయించనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాచురల్ స్టార్ నాని, నితిన్ చేతులు మీదుగా ఈ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. అయితే ఈ టీజర్ ‌ను ప్రిన్స్‌ మహేష్‌ బాబు లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అలాగే మొదటి రెండు పాటలు మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈ టైటిల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొత్తం వ్యవసాయం బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పూర్తిగా ఈ మూవీ గ్రామీణ ప్రాంతలోనే తీసినట్లు తెలుస్తోంది. అయితే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts