telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రజినీకాంత్ పార్టీలోకి .. శ్రీరెడ్డి .. సిద్ధంగా లేనంటున్న తలైవా..

srireddy conter on dorasai movie to jivita

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఫిలింనగర్ ముందు బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా కూర్చున్న శ్రీరెడ్డి అప్పట్లో సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆయన కుటుంబంపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అడపాదడపా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతు కెరియర్ ని రాణిస్తోంది. ప్రస్తుతం శ్రీ రెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్న వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంది. సుందర్ సి, విశాల్ లాంటి ప్రముఖ వ్యక్తులపై ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి…ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తమిళ అభిమానులు మరియు సామాన్య ప్రజలు సహా వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి సీరియస్ కామెంట్స్ చేసింది. రజినీకాంత్ గారు.. ఇదేమీ సినిమా కాదు సస్పెన్స్ మైంటైన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? క్లారిటీ ఇవ్వండంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు.. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. ఆయన పార్టీలో తను కూడా జాయిన్ అవుతానని మరో పోస్ట్ పెట్టింది. దీంతో శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts