telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గాలి సంపత్ నుండి విడుదలైన పాట…

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నూతన చిత్రం గాలి సంపత్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న యువ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. 2009లో బాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో చేస్తే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కూడా మెప్పించి మిడిల్ రేంజ్ హీరోగా నిలిచాడు. అయితే అనిష్ దర్శకత్వంలో శ్రీవిష్ణు చేస్తున్న గాలి సంపత్ ట్రైలర్ ను ఈ మధ్యే దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేసారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ పాట కూడా విడుదలైంది. ‘పాప ఓ పాప.. నీ పేరు తలచి నేను మజునునయ్యానే’ అంటూ సాగుతున్న ఈ పాట అభిమానులను అలరిస్తుంది. అయితే శ్రీ విష్ణు సినిమా అనగానే కొన్ని అంచనాలను పెట్టుకునే అభిమానులకు ఈ ట్రైలర్ చుసిన తర్వాత అవి మరింత పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దర్శకుడు అనిల్ రావిపుడి సమర్పణలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శక పర్యవేక్షకుడిగా చేస్తున్నాడు. అంతేకాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు మంచి స్పందన అందుకున్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే గాలి సంపత్ వాటిని అందుకుంటాడో లేదో వేచి చూడాలి మరి.

Related posts