మన దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో పుదుచ్చేరి ఉంది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయింది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వరసగా బయటకు వెళ్లిపోవడం, అంతర్గత విభేదాల కారణంగా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఏడాది ముందుగానే పుదుచ్చేరికి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల లిస్ట్ ను ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 14 మందితో కూడిన లిస్ట్ ను ప్రకటించారు. అయితే, ఈ 14 మంది లిస్ట్ లో నారాయణస్వామి పేరు లేకపోవడం విశేషం. దీనిపై ఆ పార్టీ పుదుచ్చేరి ఇంచార్జ్ గుండూరావు వివరణ ఇచ్చారు. ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి పోటీ చేయడం లేదని, పార్టీ అభిప్రాయం మేరకే అయన పేరును పక్కన పెట్టినట్టు పుదుచ్చేరి కాంగ్రెస్ పేర్కొన్నది. అయితే నారాయణస్వామికి వ్యతిరేకత ఎక్కువ కావడం కారణంగానే ఆయన్ను పార్టీ పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది.
previous post