ప్రస్తుతం మన దేశంలో కరోనా రెండో విడత విజృంభన గురించి అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారీ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే మన దేశంలో దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలను తీసుకొస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లు రాష్ట్రంలో ఫంక్షన్‌లకు 100కు మించి అథితులు హాజరయితే వారిపై జరిమానా విధిస్తోంది. అయితే ఇప్పటివరకు రాజస్థాన్‌లో ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.10 వేలు జరిమానాగా కట్టాల్సి ఉండి. అయితే ఇటీవల దీనిపై రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఎవ్వరైనా 100 మందికి మించిన అథితులతో ఎటువంటి కార్యం జరిపించినా వారికి రూ.25 వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అయితే దీని గురించి ఫంక్షన్ ప్లానర్స్‌కు తెలపమని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఇలానే చేస్తున్నాయి.
previous post
అందుకే కవిత ఓడిపోయింది: జీవన్‌రెడ్డి