telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ తో కొడుకు రిలేషన్ షిప్… స్పందించిన మోహన్ లాల్

Mohanlal

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో కళ్యాణి ప్రియదర్శన్ ఫ్రెండ్‌షిప్ మాలీవుడ్‌లో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గానే ఉంటుంది. ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శన్ కలిసి మూడేళ్ల క్రితం తీసుకున్న ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సెల్ఫీని ఆధారంగా చేసుకుని ప్రణవ్, కళ్యాణి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందనే టాక్ మొదలైంది. ఈ రూమర్లపై తాజాగా ప్రణవ్ తండ్రి, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్పందించారు. ప్రియదర్శన్, తన మాదిరిగానే ప్రణవ్, కళ్యాణి క్లోజ్ ఫ్రెండ్స్ అని మోహన్‌లాల్ చెప్పారు. ఇద్దరు స్నేహితులు కలిసి సెల్ఫీ తీసుకుంటే వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టా? అని ప్రశ్నించారు. తమ గురించి ఇలాంటి అనవసరమైన ప్రచారాలు మానుకోవాలని కోరారు. ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శన్ చెన్నైలోనే కలిసి పెరిగారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్ మంచి స్నేహితులు కావడంతో వీరి రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. ప్రణవ్ తల్లి సుచిత్ర మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్ తల్లి లిజీ (ప్రముఖ నటి) మధ్య కూడా మంచి స్నేహం ఉంది. కాగా, మోహన్‌లాల్-ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ చిత్రం ‘మరక్కర్ – అరేబికడలింతే సింహం’ సినిమాలో ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్ కలిసి తొలిసారి నటించారు. అలాగే, వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హృదయం’ చిత్రంలోనూ వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. లాక్‌డౌన్ కొవిడ్-19 పరిస్థితి కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగింది.

 

View this post on Instagram

 

Wedding scenes with the #hero

A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) on

Related posts