telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సమస్యల పరిష్కార వేదిక గా వార్డు కార్యాలయాలు – జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా జిహెచ్ఎంసి లో ప్రారంభించనున్న వార్డు కార్యాలయం ప్రజల సమస్యల  పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని జి హెచ్ ఎం సి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంబర్ పెట్ సర్కిల్ లో కాచిగూడ  వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన తదనంతరం ఏర్పాటు చేసిన సభలో ముందుగా  కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ 150 వార్డులకు గాను 132 వార్డులను ప్రారంభించనున్నట్లు మిగతా 18 వార్డులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ అన్నారు.

ముఖ్యంగా ప్రజలకు 5 వ్యవస్థలకు సంబంధించిన సమస్యల పై ఎక్కువగా ప్రజలు తమ వ్యక్తిగత సామాజిక సమస్యల పై విన్నవించడం జరుగుతున్నదన్నారు. మున్సిపల్, రెవెన్యూ,  ఆరోగ్య,  పోలీస్ విద్యుత్ వ్యవస్థ లకు సంభందించిన కాగా వార్డు కార్యాలయం లో వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖ కు సంబందించిన అధికారులు కూడా వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి నీ కోరారు. వార్డు కార్యాలయం లో మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలే కాకుండా ఇతర శాఖల సమస్యలను కూడా స్వీకరించి  సంబంధించిన శాఖకు తెలియజేయడం జరుగుతుందన్నారు. గౌరవ మంత్రివర్యులు ఆదేశాల ప్రకారం వార్డు వ్యవస్థ పనితీరును సమీక్షించి  ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
వార్డు కార్యాలయం ఏర్పాటుకు  దేశం లో గల మెట్రో పాలిటి నగరాలైన చెన్నై , బెంగుళూరు,  కలకత్తా, ముంబాయి, ఢిల్లీ నగరాలకు అధికారులను   పరిశీలించడానికి పంపించడం జరిగిందని   మినిస్టర్   ఇన్నోటివ్ ప్రకారంగా  పంలించిగా సమగ్ర వార్డు సిస్టమ్ లేదని తెలిసినది సమగ్ర వార్డు  ఏర్పాటు కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా సమస్యలు విన్నవించడానికి ఇక నుండి జోనల్ , సర్కిల్ కార్యాలయాలకు వెళ్లకుండా  స్థానిక వార్డు కార్యాలయం వచ్చి సమస్యను పరిష్కరించుకునే అవకాశం  ఉంటుందన్నారు

జల మండలి ఏం డి  దాన కిషోర్ మాట్లాడుతూ కాచిగూడ వార్డులో 5o వేల జనాభా ఉంటే 5200 నల్లా కనెక్షన్లు ఉన్నాయి త్రాగు నీరు నిర్దేశించిన ప్రకారం గా సప్లై చేస్తున్నప్పటికీ
కొన్ని కొన్ని సార్లు  లో ప్రెషర్ అంతేకాకుండా సివరేజీ సమస్య కూడా అనుకోకుండా   వస్తుంది అందుకు వార్డు కార్యాలయం సిబ్బందికి మెన్  మెటీరియల్ సిద్ధంగా ఉంచామన్నారు.
ఈ కార్యక్రమం లో  శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ కౌన్సిలర్ శ్రీమతి ఉమాదేవి ఈ వి డీ ఏమ్ డైరెక్టర్  ప్రకాష్ రెడ్డి యు బి డి అడిషనల్ కమిషనర్  వి కృష్ణ,జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డి సి వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు.

Related posts