telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రామతీర్థం విగ్రహం దాడి ఉద్దేశ పూర్వకంగానే జరిగింది…

ఏపీలో రామతీర్థం ఘటన బాగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా వారు దర్యాప్తు వేగవంతం చేసారు. ఈరోజు దుండగులు దాడిలో దెబ్బతిన్న కోదండరామ స్వామి విగ్రహాన్ని సీఐడీ అడిషనల్ డీజీ సినీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…  రామతీర్థం విగ్రహం దాడి ఉద్దేశ పూర్వకంగానే జరిగింది. పక్కా ప్రణాళికతో పకడ్బందీ గా చేసిన చర్య ఇది. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం, సమాజంలో వివాదాలు సృష్టించడం ఈ చర్యకు ఉద్దేశంగా కనిపిస్తోంది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది. ఆలయం గురించి సమగ్రంగా తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానిస్తున్నాం. ఆకతాయిలు చర్యగా భావించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సంఘటన స్థలంలో హెక్సా బ్లెడ్ లభ్యమైంది. స్థానికులు కానీ వారి సహాకారంతో బయటి వ్యక్తులు కానీ విగ్రహంపై దాడికి పాల్పడి ఉండవొచ్చు అని అనుమానం వ్యక్తం చేసారు. సుమారు 400మీటర్ల ఎత్తు,300మెట్లు ఉన్న కొండపై ఆలయానికి చేరుకుని విగ్రహం ధ్వంసం చేయడం సాధారణమైన విషయం కాదు. ప్రాథమిక ఆధారాలు సేకరించాం. డీఐజీ హరికృష్ణ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు అని అన్నారు. చూడాలి మరి ఈ కేసు ఎప్పటికి ముగుస్తుంది అనేది.

Related posts