telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌, కేటీఆర్‌లపై బండి సంజయ్ ఫైర్…జుటా బాప్.. జూటా బేట అంటూ

తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసార నిప్పులు చెరిగారు.  ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. సీఎం సర్వేలన్నీ బీజేపీ గెలుపు అని చెబుతున్నాయని  బండి సంజయ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం మచ్చర్లలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సర్వేలో బీజేపీ గెలుస్తోందని తెలిసి సీఎం కేసీఆర్‌ బహురూపుల వేషం వేస్తున్నాడని..జిమ్మిక్కులు చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. టీఆరెస్ అభ్యర్థులను గెలిపించమని సీఎం ఓట్లు ఆడిగినాడా… కనీసం పట్టభద్రులకు ఓట్లు అడగా లేదు…అది ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఓటు అడగని పార్టీకి ఎందుకు ఓటు… మంత్రి నిరంజన్ రెడ్డి టీచర్లను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల డ్యూటీ వేయకుండా టీచర్లను అవమానం చేసారని.. జుటా బాప్.. జూటా బేట అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌లపై మండిపడ్డారు. కొత్తగా లేటర్లు రాస్తున్నాడని.. ఇప్పటిదాకా ITIR, రైల్వే కోచ్ గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిప్పులు చెరిగారు బండి సంజయ్‌. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్తులను గెలిపిస్తే PRC, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు వస్తాయని… పోడు సమస్య తీరుతుందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల కోసం నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్‌ తెలిపారు. పోడు భూముల విషయంలో కేసీఆర్ డ్రామా అడుతున్నాడని.. పోడు భూముల్ని లాక్కొని హరిత హారం చేయమని చెప్పేది సీఎం కేసీఆరేనని మండిపడ్డారు.

Related posts