telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హైదరాబాద్‌లో కరెంటే ఉండటం లేదు..నేను అనుభవించా ..

హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదని, స్వయంగా తనకే ఆ అనుభవం ఎదురైందని కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారేమో.. కానీ తాను నిన్న‌టి వరకు హైద‌రాబాద్‌లోనే ఉన్నానని , అక్కడ అసలే కరెంట్ ఉండటం లేదని, జనరేటర్‌ వేసుకొని ఉండివచ్చానన్నారు.

తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసినప్పటికీ తాను ఎవ‌రికి చెప్పుకోవడం లేదు క‌దా అని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు.

తాను ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డుమీదే నిలబడి మాట్లాడుతున్నానని, కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో స్వయంగా చూపిస్తానని పేర్కొన్నారు.

కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు..అంతేగానీ పొరుగు రాష్ట్రాల‌ను తక్కువ చేసి మాట్లాడరాదని అన్నారు. కేటీఆర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.

ఇక, ఏపీలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై స్పందించిన మంత్రి బొత్స.. ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. నంద్యాలలోను పేపర్ బయటకు రావడం అనేది ఒట్టి పుకారు మాత్రమేనన్నారు. సత్యసాయిలో 12.15కి పేపర్ బయటకు వచ్చిందన్నారు. 

టెక్నాలజీ పెరిగిపోయిన తరువాత ఒకరి కోసమో ఇద్దరి కోసమో, ఒక రూంలోని వారి కోసమో కుట్రతో చేస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిని ప్రైవేటు కాలేజీలకు ఆపాదించలేము. ఎక్కడ ఏ చిన్న అంశం జరిగినా సరే వారిని అదుపులోకి తీసుకుంటాం అని పేర్కొన్నారు

Related posts