telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం: సీఎం జగన్

cm jagan ycp

ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ‘మన పాలన-మీ సూచన’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతులు పండించే పంటలో 30 శాతాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు పండించే పంటను జనతా బజార్లలో విక్రయిస్తామని తెలిపారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు తీసుకొచ్చిన రైతు భరోసా సెంటర్ల ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని తెలిపారు.

రైతు భరోసా సెంటర్లలో కియోస్క్ లు, ల్యాబ్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమని జగన్ చెప్పారు. గిట్టుబాటు ధర లభించినప్పుడే రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు. రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా రూ. 13,500 పంటసాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. రైతులకు వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు.

Related posts