టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు వల్లనే రాజీనామ చేశానని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యామిని పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా
పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర ప్రభుత్వంపై వేసిన సెటైర్లతో ఒక్కసారిగా హైలెట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరా పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గత కొంత కాలంగా ఆమె పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో..యామిని త్వరలోనే కాషాయా కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి.