ఇప్పుడు రిటైరవుతున్నా కాబట్టి నా ఓటు హక్కు కోసం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తానని అన్నారు నిమ్మగడ్డ. ఎస్ఈసీకున్న అధికారాలను వినియోగించుకున్నా కానీ.. వేరే వారి పరిధిలోకి వెళ్లలేదని ఆయన అన్నారు. చట్ట సభను గౌరవించాల్సిందే.. నాకూ గౌరవం ఉందన్న ఆయన గవర్నర్ వ్యవస్థ పట్ల నాకు అవగాహన ఉందని అన్నారు.. వీలున్నంత వరకు నేను న్యాయం చేసే ప్రయత్నం చేశాను.. బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలపై నిబంధనలకు లోబడి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎస్ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని, ఎన్నికల సంస్కరణలపై నివేదిక రూపొందించి గవర్నరుకు పంపానని అన్నారు. నీలం సాహ్నీ నా తర్వాత ఎస్ఈసీగా రాబోతున్నారు.. సంతోషం..ఎస్ఈసీ విధులు.. బాధ్యతలపై ఆమెతో చర్చించానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. విభజన తర్వాత పటిష్టమైన పునాదులతో ఎస్ఈసీ ఏర్పాటు కావాల్సి ఉందని ఎస్ఈసీ స్వతంత్రత, నిబద్దతతో కలిగి ఉండాలని అన్నారు. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించామని అన్నారు.
previous post
next post