telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా కంటే ప్రమాదకరం చంద్రబాబు..

టిడిపి అధినేత చంద్రబాబుపై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కరోనా కంటే ప్రమాదకరం చంద్రబాబు అని.. తన కొడుకు భవిష్యత్తు కోసం విపత్తు సమయంలో రాజకీయ చేస్తున్నారన్నారు. చంద్రబాబుది 13 ఏళ్ల దిక్కు మాలిన అనుభవమని.. ప్రాణ భయంతో పక్క రాష్ట్రంలో దాక్కుని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా నుంచి N440K అనే వైరస్ వ్యాపిస్తుందని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని.. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి స్వయంగా ఇటువంటి వైరస్ లేదని ప్రకటన చేశారని గుర్తు చేశారు. సీసీఎమ్బీ డైరెక్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చంద్రబాబుకు ఎందుకు కసి? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పదవి దిగే సమయానికి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఏ రకంగా ఉండేది ? అని మండిపడ్డారు.

Related posts