అసెంబ్లీలో వైఎస్ ఆర్ సీపీ నేతలు తీరుకు మనస్తాపం చెందిన తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై వైకాపా నేతలు ఒక్కొక్కరు ఒక్కొ విధంగా సెటైర్లు వేస్తున్నారు..ఈ క్రమంలో వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అందులో ముందువరుసలో ఉంటుంది..
చందబాబు విధి ఎవరినీ విడిచిపెట్టదనీ, అందరి సరదా తీర్చేస్తుందనీ, 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ఎంత ఏడిపించారో గుర్తుందా అంటూ రోజా ప్రశ్నించారు. ఇప్పుడు అదే వయసులో.. 71 సంవత్సరాలా 7 నెలలకే చంద్రబాబు ఏడ్చే పరస్థితి వచ్చిందని..అందుకే అంటారు.. మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుందని అన్నారు. ఏదో నీ భార్యను అనేసారని చాలా బాధపడిపోతున్నావు..ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేసిందని పీతల సూజాతో మీడియా పాయింట్‌లో సిడీలు చూపించి నన్ను ఆవమానించావు నీకు గుర్తున్నాయా అంటూ మండిపడ్డారు.
ఆనాడు నీవు ఎవరిమీద ఎలాంటి కామెంట్స్ చేశావో అంతా గుర్తుంచుకున్నారని అన్నారు. ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడ్పులు ఏడ్చేస్తున్న నిన్ను ఎవరూ జాలితో కూడా చూడరని తెలుసుకో అన్నారు. ప్రధాని మోడీతో సహా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావో తెలుసన్నారు. చంద్రబాబు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానని కామెంట్ చేశారు రోజా.
నీ కోసం, నీ పార్టీ కోసం పదేళ్లు కష్టపడిన మహిళ అని కూడా కనికరం లేకుండా నా క్యారెక్టర్‌ను అవమానించారు. మహిళా పార్లమెంట్‌కు పిలిచి నన్ను 24 గంటలు డిటెయిన్ చేసి నన్ను మానసిక క్షోభకు గురిచేశారు. నన్ను రూల్స్‌కు విరుద్ధంగా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయగలిగావు. కానీ దేవుడు నిన్ను రెండున్నర సంవత్సరాలు కాదు కదా జీవితంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టని విధంగా నీకు నువ్వే శపథం చేసుకున్నావు. బైబై బాబూ అంటూ రోజా వీడియో విడుదల చేశారు.