telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రెండో రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది.

రాహుల్ గాంధీతో కేంద్ర మాజీ మంత్రి ఎంపీ పీ. చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ తదితరులతో నడవనున్నారు

ఇవాళ మొత్తంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 2 గంటలకు మహిళలతో భేటీ కానున్నారు. ఇక రాత్రి 7 గంటల వరకు పాదయాత్ర సాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు రెండు విడతలుగా రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,570 కి.మీ ప్రయాణంలో తనతో కలిసి నడిచే భారత యాత్రికుల శిబిరం వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేశారు. 118 మంది ‘భారత్ యాత్రికులు’ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ఇక్కడి అగస్తీశ్వరం నుండి పాదయాత్రను ప్రారంభించారు.

మరో రెండు రోజులు పాటు తమిళనాడులోనే రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియిక్కవిలాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. కేరళలోని 12 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాల్లో… సెప్టెంబర్ 29 వరకు యాత్ర సాగనుంది. రాష్ట్రంలోని త్రిసూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

Related posts