telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు..

*కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌కు ముహుర్తం ఖ‌రారు..

*26 జిల్లాలు, 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు

*ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ఆవ‌త‌ర‌ణ‌

ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏప్రిల్ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం నిర్ణయించింది. ఏప్రిల్ 4వ తేదీని కొత్త జిల్లాలపై ఏపీ సర్కార్ ప్రకటన చేయనుంది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకటన వెలువడనుంది..

ఇదిలా ఉంటే  నూతన జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. జిల్లాల ఏర్పాటుపై వర్చువల్ గా సమావేశమైన మంత్రివర్గం.. 26 జిల్లాలు, 22 కొత్త రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రెవెన్యూ డివిజన్‌గా మారనుంది.

అదేవిధంగా పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తిలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు కానున్నాయి. వీటిని కూడా కొత్త నోటిఫికేషన్లో ప్రస్తావించనున్నారు.

AP CM YS Jagan to inguate new districts on April 4

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త జిల్లాలపై ఉన్నతస్థాయి సమావేశంలో జరిగింది.జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులు తదితర అంశాలపై భేటీలో చర్చ జరిగింది. రెవెన్యూ డివిజన్ల విషయంలో పలువురు ప్రజాప్రతినిథుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సమావేశంలో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది .

అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటును ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ రేపు వెలువడనుంది.

ఈ స‌మావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ప్లానింగ్‌ సెక్రటరీ జి విజయకుమార్, ఐటీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, లా సెక్రటరీ వి సునీత ఇతర ఉన్నతాధికారులు హాజయ్యారు.

Related posts