telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు లిక్కర్‌ ఆఫ‌ర్..

ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.. బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు చేసిన లిక్కర్‌ కామెంట్‌పై నేష‌న‌ల్ వైల్డ్‌గా చ‌ర్చానీయాంశం అయింది..

వీర్రాజు నిన్న సభలో మాట్లాడుతూ.. కోటీ మంది తాగుతున్నారు..కోటీ ఓట్లు వేయండి…బీజేపీ అధికారంలోకి వస్తే 75కే చీప్‌ లిక్కర్‌. ఆదాయం ఇంకా బాగుంటే 50 రూపాయలకి తగ్గిస్తాం అంటూ హామీనిచ్చారు. ప్ర‌జ‌లు కోరిక‌లు తీరుస్తామ‌ని అన్నారు.

ఏపీలో గ్రామాలకు వచ్చిన నిధులను ప్రభుత్వం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే జగనన్న రైతు భరోసా కేంద్రాలను నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు.

AP BJP's Strange Promise On Cheap Liquor

జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదేని… మనం ఎందుకు భయపడాలి? మనం ఎప్పుడైనా జైలుకు వెళ్లామా అంటూ వీర్రాజు దుయ్యబట్టారు. ఆస్తులు పోగేసుకునేందుకే ఈ నేతల తాపత్రయమని… రాజకీయాల్లో నిరాడంబరత్వం చూపించిన పార్టీ మాదేనని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీ లీజుల గురించి మాట్లాడితే ఆ పార్టీ నేతల చొక్కాలు కూడా ఉండవు. బద్వేల్ ఎన్నికల్లో వైసీపీకి ప్యాంటులు తడిచిపోయాయి. కరపత్రం ఎన్నికలు జరుగుంటే బీజేపీకి 40 వేల ఓట్లు వచ్చేవి. కానీ వైసీపీ డబ్బులు పంచింది..? ఏజెంట్లను కొన్నది..? మా పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుని కోసం 50 కార్లు వెళ్లాయంటూ ఆయన ఆరోపించారు.

ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలుంటే.. బీజేపీ దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మేం ట్రేడింగ్ చేయం.. రూలింగ్ చేస్తామంటూ వ్యాఖ్యానించారు.

Cast 1 Crore Votes And We Will Provide Liquor For Rs 70': Andhra BJP  President Promises | India.com

అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉద్యమించనున్నామని, ఉత్తరాంధ్ర జిల్లాలో బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క హర్బర్, బెర్తుల్లేవా..? రాష్ట్ర మత్స్య శాఖ మంత్రికి ఎంత బడ్జెట్ ఉంటుందో.. అంత నిధులను మేం ఒక్క బెర్త్ కోసం కేటాయిస్తున్నామ‌ని అన్నారు.

అలాగే ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలని.. ఇది నీతి ఆయోగ్‌ పరిధిలో ఉందని ఆయన పేర్కొన్నారు .దేశంలో చాలా రాష్ట్రాలు విడిపోయి రాజధానిని నిర్మించుకున్నాయని.. చంద్రబాబు రైతులను మోసం చేసి, నడిరోడ్డుపై నిలబెట్టారని ఆయన మండిపడ్డారు.

తిరుపతి వరకూ రైతులను నడిపించారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోనే రాజధాని వుండాలని.. బీజేపీ ఆఫీసును కూడా ఇక్కడే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. మాకు అధికారం ఇస్తే మూడేళ్లలోనే రాజధానిని నిర్మిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు

Related posts