రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓ వైపు ఆగస్టు 15వ తేదీన విశాఖ రాజధానికి శంకుస్థాపన చేసే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై నిరసన కార్యక్రమాలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన రేపు కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది.
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో మూడు రాజధానులపై నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అమరావతి రైతులకు జనసేన అండ ఎలా ఉండాలనే విషయంపై కూడా చర్చలు జరపనున్నారు.
కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..చంద్రబాబుకు గిఫ్ట్ గా మారుతుంది: పవన్