విద్యాశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విద్యాశాఖపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విలువలతో కూడిన విద్యను అందిస్తామని, నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించటమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.
రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలను వసతుల ద్వారా, విద్యా ప్రమాణాల ద్వారా మార్పు చేస్తామని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేరికలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని తెలిపారు. తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామన్నారు. . విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందిస్తామని చెప్పారు. అమ్మ ఒడి పథకాన్ని 2020, జనవరి 26న ప్రారంభం కానుందని మంత్రి వెల్లడించారు.