బీజేపీ మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఇంకా అడుగులు వేస్తూనే ఉంది. దానిలో భాగంగా గురువారం గవర్నర్ భగత్ సింగ్ కోషియార్‌తో భేటీ కానుంది. తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై శివసేన స్పందించింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఒకవేళ వారు గవర్నర్‌ను కలిస్తే, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఇప్పటి వరకైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని బీజేపీ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని రౌత్ స్పష్టం చేశారు.
ఆపద్ధర్మ సీఎం దేవేంద్ర ఫడణ్‌వీస్ శివసేన మంత్రులతో సమావేశమయ్యారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు చేయాల్సిన ఆర్థిక సాయంపై చర్చించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత బీజేపీ మంత్రి సుధీర్ ముదిగంటివార్ మాట్లాడుతూ తొందర్లోనే శుభ వార్త వింటారని, బీజేపీ, శివసేన వేర్వేరు కాదని సుధీర్ ప్రకటించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతా : పవన్