telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖలో ‘క్యాట్’ బెంచ్ ఏర్పాటు చేయాలి: విజయసాయి

vijayasaireddy ycp

విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్‌ ఏర్పాటు వంటి అంశాలపై రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్స్‌ బెంచ్‌ ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు.

ఏపీలో 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే పని చేస్తున్నారని తెలిపారు. ఏపీలో క్యాట్‌ బెంచ్‌ లేకపోవడంతో పిటిషనర్లు తమ వివాదాల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌కు వెళ్తున్నారని విజయసాయి
అన్నారు.

టీడీపీ ఎంపీ కనకమేడల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన కోరారు. , వైసీపీ సర్కారు చర్యలను నియంత్రించాలని కనకమేడల కోరారు. మూడు రాజధానులపై వైసీపీ తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని ఆయన అభ్యంతరాలు తెలిపారు.

Related posts