telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌ల‌కు షాక్‌..బారీగా విద్యుత్ చార్జీల పెంపు

*ఏపీలో విద్యుత్ ఛార్జీలు  పెంచుతూ ఏపీఈఆర్సీ నిర్ణయం

*బారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు

*కొత్తగా కేటగిరీలు రద్దు చేసి ఆరు స్లాబులు తీసుకొచ్చారు

*ధ‌ర‌లు పెంపు బాధాక‌రం..త‌ప్ప‌డం లేదు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెర‌గ‌నున్నాయి. విద్యుత్ ఛార్జీల్ని పెంచుతూ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 45 పైసల నుంచి రూపాయి 40 పైసల వరకూ పెరగబోతున్నాయి.

తాజాగా పెరిగిన విద్యుత్ ఛార్జీల ధరల వివరాలు..

30 యూనిట్ల వరకూ యూనిట్ కు 45 పైసలు పెరిగింది. అలాగే 31-75 యూనిట్ల వరకూ యూనిట్ కు 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 76-125 యూనిట్ల వరకూ యూనిట్ కు 1.40పైసలు పెంపు వర్తింపచేయనున్నారు. 126-225 యూనిట్ల వరకూ రూ.1.57 పెరిగింది. అలాగే 226-400 యూనిట్ల వరకూ 1.16 పెరిగింది.

అలాగే 400 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారిపై రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. కొత్త ఛార్జీలపై ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తప్పలేదని ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి తెలిపారు. ధరల పెంపు బాధాకరమే అన్నారుప్ర‌స్తుతం ఉన్న‌ కేటగిరిలను రద్దు చేసి ఆరు స్లాబ్ లను తీసుకొచ్చినట్టుగా ఏపీ ఈఆర్‌సీ చైర్మెన్ ప్రకటించారు.

Related posts