telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

గ్రామవాలెంటీర్ : … నేడు ఇంటర్వ్యూలు .. కోర్టులో కేసు..

interviews for village volunteers

నేటి నుండి గ్రామీణాభివృద్ధిశాఖ గ్రామ వలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏదైనా మండలంలో 700కు పైగా దరఖాస్తులు వస్తే అక్కడ అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఇప్పటికే సూచించారు. తొలిరోజు ఒక్కో మండలంలో ఇంటర్వ్యూ బోర్డు 30 మందినే పిలవాలని, రెండో రోజు నుంచి రోజూ 60 మందికి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యనే ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు.

మహిళా అభ్యర్థులు, దివ్యాంగులను మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30 గంటల మధ్య మాత్రమే పిలవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఫొటో ఐడీ, జెరాక్స్‌ కాఫీలు, సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూకు 30 నిమిషాల ముందుగా హాజరు కావాల్సి ఉంటుందని మండల స్థాయి అధికారులకు కమిషనర్‌ గిరిజాశంకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు.

Related posts