telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జిల్లాల పునర్విభజన ఒక చారిత్రాత్మక నిర్ణ‌యం..

*ఏపీలో చంద్ర‌బాబు హయాంలో 14ఏళ్ళ పాటు సైకో పాలన సాగింది

*అభివృద్ధి ద్యేయంగా కొత్త‌లు జిల్లాలు ఏర్పాటు..
*ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమ‌ల్లోకి వ‌స్తాయి..

చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూర్చొని ఏపీ పాలన పై బురద జల్లుతున్నారని..విమర్శించే ముందు ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు

చంద్రబాబు హయాంలోని 14 సంవత్సరాల పాటు సైకో పాలన సాగిందని టిడిపి పాలనను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసిపి, వైఎస్ జగన్ పై నమ్మకంతో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపిలను గెలిపించారు.ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విషయం అందించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికల్లో డబ్బులు పంచటం టీడీపి సంస్కృతని, ఇప్పటికే చంద్రబాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కోసం డబ్బులు కూడ పెడుతున్నారని ధ్వజమెత్తారు. వారు ఎంత ప్రయత్నించినా వైసిపి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

సీఎం జగన్‌ తీసుకున్న జిల్లాల పునర్విభజన ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ప్రారంభమవుతాయని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉగాది రోజున లాంచనంగా కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభిస్తారని వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లుగా వెల్ల‌డించారు.

గతంలో జిల్లాలు సుదీర్ఘ ప్రాంతాలు ఉండటంతో పాలనలో ఇబ్బందులు ఉండేవి. ఉదాహరణకు మదనపల్లె భారత దేశంలోనే పెద్ద డివిజన్ గా వుంది. ఇలాంటి చోట్ల ఇదివరకు పాలన కష్టతరంగా వుండేది. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అధికారులకు జిల్లాపై పట్టు ఉంటుందని, జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సులభంగా తిరగడానికి వీలుంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Related posts