telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ…

cm jagan ycp

మార్చి నెలలో ఫించన్‌ అందుకున్న పలువురు రిటైర్డ్‌ ఉద్యోగులకు షాకిస్తూ.. భారీ ఎత్తున పెన్షన్‌లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం.. .. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ కోత పెట్టేసింది.. అయితే, భారీగా కోత పడడంపై రిటైర్డ్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఆదాయపన్ను నిమిత్తం ప్రతీ ఏడాది ఇలాంటి కోత ఉంటుందని చెబుతున్నారు ఆర్థిక శాఖ అధికారులు.. చాలా మంది రిటైర్డ్‌ ఉద్యోగులు సేవింగ్స్‌ క్లెయిమ్స్‌ ఇవ్వకపోవడం వల్ల.. ఇలా, కోత విధింపు ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు.. కానీ, సేవింగ్స్‌కు సంబంధించిన క్లెయిమ్‌లను పంపినా.. తమకు చేరలేదంటూ ట్రెజరీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆరోపిస్తున్నారు రిటైర్డ్‌ ఉద్యోగులు.. ఇంకా జమ చేయని డీఏ బకాయిలను కూడా కలిపేసి ఇన్‌కమ్ టాక్స్ లెక్కలు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. అదేమని అడిగితే రిఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటున్నారు రిటైర్‌ ఉద్యోగులు. చూడాలి మరి ఈ విషయం ఎక్కడివరకు వెళ్తుంది… ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts