telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ ఆ వ్యాఖ్య‌లు – మంత్రి పెద్దిరెడ్డి కౌంట‌ర్‌

ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లులేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్ తీవ్ర దూమారం రేపుతోంది.

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ..తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులున్నాయని.. అందుకే అక్కడ కరెంట్ కోతలు లేవన్నారు.

ఏపీలో విద్యుత్‌ కోతలు లేవని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రైతులకు ఏడు గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని.. ఎక్కడైనా సాంకేతిక సమస్యతో పావుగంట మాత్రమే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చునని… ఏపీలో పరిస్థితి బాగాలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించి ఉండవచ్చునని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు .

Related posts