ఈ రోజు జమ్ముకశ్మీర్ కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ జవాన్ ర్యాడ మహేశ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోని స్వగ్రామం కోమన్‌పల్లికి తరలించారు. సైనిక లాంఛనాలతో ఇవాళ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఇక ఏపీకి చెందిన కమాండో ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతదేహం కూడా ఐరాల మండలం రెడ్డి వారి పల్లికి చేరుకుంది. ఒంటి గంట తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇక జమ్ముకశ్మీర్ కాల్పుల్లో అమరుడైన జవాన్ ర్యాడ మహేశ్ పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం, కోమన్‌పల్లి గ్రామానికి తరలించారు. ఇవాళ సైనికలాంఛనాలతో వీరుడికి అంతిమసంస్కారాలు జరుగుతాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
previous post
లేనిది ఉన్నట్టు సృష్టించడం టీడీపీ నైజం: మంత్రి బుగ్గన