telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్ లో అందుకే గెలిచాం అంటున్న కేంద్ర మంత్రులు…

bjp party

ఎంతో ఆసక్తికరంగా సాగిన బీహార్ ఎన్నికల్లో ఎట్టకేలకు ఎన్‌డీఏ విజయం సాధించింది. ఎంతో పోటీ ఇచ్చినప్పటికీ ఆర్‌జేడీ బీహార్ సీఎం పదవిని సొంతం చేసుకోలేక పోయింది. మొదట ఆధిక్యంలో ఉన్న ఆర్‌జేడీ లెక్కింపు పెరిగే కొద్దీ తన లీడ్‌ను కోల్పోయింది. అందే విధంగా జేడీయూ తన ఆధిక్యాన్ని పెంచుకుంది. దానిపై కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, అశ్వినీ కుమార్ చౌబేలు ప్రధానిని కొనియాడారు. ఎన్‌డీయే బీహార్ ఎన్నికల్లో ఎంతో అద్భుతంగా రాణించిందని అన్నారు. అంతేకాకుండా ఇదొక చారిత్రక విజయం అని, ఎన్‌డీఏ మరోసారి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని తెలిపారు. అంతేకాకుండా ఈ విజయానికి మోడీ కృషి, దేశానికి అతను చేసిన ఎనలేని సేవే కారణమని తెలిపారు. అయితే బీహార్ అభివృద్ది కాకపోతే దేశ అభివృద్ది జరగదన్న మోదీ మాటలను ఒప్పుకోక తప్పదని చెప్పారు. అయితే బీహార్ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని, ఇద్దరు యువరాజ్‌లను తిరస్కరించారని చౌబే అన్నారు. బీహార్ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నాని, మోదీ చేసిన కష్టం కారణంగానే రాష్ట్రంలో ప్రజలు తమ పార్టీని అంతలా నమ్మారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీచేసిన మహాఘట్ కూటమిలో ఆర్‌జేడీకి 75 సీట్లు, కాంగ్రెస్‌కు 19, మిగిలిన వారికి 16 సీట్లతో మొత్తం ఈ కూటమి 110 సీట్లను గెలుచుకుంది.

Related posts