టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట అని విజయసాయి వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణతో పాటు మరో ఇద్దరిని సీఎం జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మోపిదేవి, బోస్ ల పార్టీ విధేయతను గుర్తించి సీఎం జగన్ గారు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా పరోక్షంగా బాబు పై విమర్శలు చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే నీకూ జగన్ గారికి తేడా’ అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.