telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : రాహుల్ పై వితిక షాకింగ్ కామెంట్స్…!?

Vithika

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్రమం ముగింపు దశకు వచ్చేసింది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 12వ వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితికా ఎలిమినేట్ అయ్యింది. గత వారం ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్క‌ర్‌, వరుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్‌, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉండగా… 12వ వారం కోసం అందరూ ఎలిమినేషన్ లోకి వచ్చారు. మ‌రి వ‌చ్చేవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా… తొలి రోజు నుండి కంబైన్డ్ గేమ్ ఆడుతున్న వ‌రుణ్ సందేశ్, వితికా షెరుపై తొలి రోజుల‌లో నెగెటివ్ ఒపినీయ‌న్ బాగా ఉన్నా, ఆమె నామినేష‌న్‌లోకి పెద్ద‌గా రాలేదు. వరుణ్‌తో కలిసి జంటగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వితికా షెరు.. వీక్ కంటెస్టెంట్ అని తొలి నుండి విమర్శలు ఉన్నప్పటికీ ఆమె ఇన్ని వీక్స్ హౌస్‌లో కొనసాగడం అందరికీ ఆశ్చర్యమే. 13 వారాలు పాటు బిగ్ బాస్ హౌస్‌లో జంటగా జర్నీ చేసిన వితికా ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన విషయం తెలిసింది. కాగా.. ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వస్తూ స్టార్ మా వారి బిగ్ బాస్ బజ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది వితికా షెరు. ఈ ఇంటర్వ్యూకి తనీష్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తనీష్ యాంకరింగ్ సంగతి పక్కనపెట్టేస్తే.. ఆ షోలో వితికా చేసిన కామెంట్స్ రాహుల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తనను సిస్టర్‌గా భావించే రాహుల్ సిప్లిగంజ్‌ అవకాశ వాది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది వితిక.

Related posts