telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ వైఫల్యాలకు అనంతపురం చక్కటి ఉదాహరణ: లోకేశ్

ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు అనంతపురం జిల్లా చక్కటి ఉదాహరణ అని అన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ముందుండి పనిచేస్తోన్న వారికి కనీస సదుపాయాలైన మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలను ఇవ్వలేదన్నారు.

ఈ జిల్లాలో కరోనా బారిన పడిన వారిలో వైద్యులు, నర్సులే అధికంగా ఉన్నారని తెలిపారు. కరోనాపై యుద్ధం చేస్తోన్న వారికి ఈ ప్రభుత్వం ఆయుధాలు (మాస్కులు, పీపీఈ కిట్లు) ఇవ్వడం లేదు’ అని నారా లోకేశ్ విమర్శలు గుప్పిస్తూ, అందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. తమకు సదుపాయాలు కల్పించాలని నిరసనలు చేసిన వైద్య సిబ్బంది చివరకు సస్పెండ్‌ కూడా అయ్యారని లోకేశ్ అన్నారు.

Related posts