telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో మళ్ళీ తగ్గిన కరోనా కేసులు…

corona vaccine India

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా కేసులు 8.33 లక్షలు దాటిపోయాయి. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,410 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 838363 కు చేరింది. ఇందులో 21825 కేసులు యాక్టివ్ గా ఉంటె, 809770 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 11 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6768కి చేరింది.

ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 115, చిత్తూరులో 159, తూర్పుగోదావరి జిల్లాలో 267, గుంటూరులో 194, కడపలో 73, కృష్ణాలో 153, కర్నూలులో 11, నెల్లూరులో 95, ప్రకాశంలో 60, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 84, విజయనగరంలో 20, పశ్చిమ గోదావరిలో 128 కేసులు నమోదయ్యాయి.

Related posts