telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళికి సిద్ధమైన జబర్దస్త్ బ్యూటీ రష్మీ… వరుడు ఎవరంటే ?

Rashmi

జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ పెళ్ళికి సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటు బుల్లితెర, అటు వెండితెరపై హవా సాగిస్తున్న రష్మి గౌతమ్ కు 32 ఏళ్ళు. రష్మీ ఇప్పటికే తనకు కాబోయే వరుడిని సెలక్ట్ చేసుకుందని తెలుస్తోంది. అతనో బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అతనితో డీప్‌గా చర్చించి పెళ్లి తర్వాత ప్లాన్స్ గురించి రష్మీ వివరించినట్లు టాక్. రష్మీ అభిప్రాయంతో అతను ఏకీభవించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ మేరకు ఇరు కుటుంబాల పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో పడ్డారని టాక్. అయితే ఈ విషయం తెలియగానే నెటిజన్ల చూపు సుడిగాలి సుధీర్‌పై పడింది. బుల్లితెరపై రష్మీ- సుధీర్ జోడీకి స్పెషల్ పాపులారిటీ ఉంది. కెమెరా ముందు ఈ ఇద్దరు పండించే రొమాన్స్ ఆడియన్స్‌కి యమ కిక్కివ్వడంతో రష్మీ- సుధీర్ డేటింగ్, పెళ్లి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తామిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఇటు రష్మీ, అటు సుధీర్ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్ పడలేదు. ఇక తన తోటి యాంకర్స్ అంతా పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్ కెరీర్‌‌ కొనసాగిస్తున్నారు. అదే బాటలో తాను కూడా మ్యారేజ్ తర్వాత కెరీర్ కొనసాగించాలని డిసైడ్ అయిందట రష్మీ గౌతమ్.

Related posts