telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పుట్ట‌బోయేది అమ్మాయా? అబ్బాయా? ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా !

అబ్బాయిని పుట్టించ‌లేద‌ని భార్య‌కు విడాకులిచ్చిన భ‌ర్త‌…..!వార‌సుడిని క‌న‌లేద‌ని కోడ‌లికి మ‌త్తు మందు ఇచ్చి చంపేసిన అత్త‌.! మగ సంతానం కోసం ముక్కులో నాటు పసరు మందు పోవడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భవతి….!మగ సంతానం కోసం ఆ మందులు ఈ మందులు వాడడం వల్ల గర్భస్రావం జరిగి ఆత్మహత్య చేసుకున్న మహిళ….!

ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం నిత్యం న్యూస్ పేప‌ర్లలో చ‌దువుతూనే ఉంటాం! అయితే నిజంగా ….అబ్బాయి ని పుట్టించ‌డం భార్య చేతిలో ఉంటుందా? అస‌లు పుట్ట‌బోయేది అమ్మాయా? అబ్బాయా? ఎలా డిసైడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం!

మాన‌వ‌శ‌రీరంలో మొత్తం 23 జ‌త‌ల క్రోమోజోమ్స్ ఉంటాయి..అందులో ఒక జ‌త లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. అవి పురుషుల‌లో XY గా, స్త్రీల‌లో XX గా ఉంటాయి.

స్త్రీ పురుషుల క‌ల‌యిక కార‌ణంగా…పురుషుల నుండి X లేదా Y క్రోమోజోమ్ వ‌చ్చి స్త్రీ ద‌గ్గ‌ర ఉన్న X తో క‌లుస్తుంది. ఒక వేళ పురుషుడి నుండి X వ‌చ్చి స్త్రీ నుండి వ‌చ్చిన X తో ఫ‌ల‌దీక‌ర‌ణం చెందితే XX అంటే అమ్మాయి పుడుతుంది.

ఒక‌వేళ పురుషుడి నుండి Y క్రోమోజోమ్ వ‌చ్చి స్త్రీ యొక్క X క్రోమోజోమ్ తో జ‌త‌క‌లిస్తే…. XY కార‌ణంగా అబ్బాయి పుడ‌తాడు.

Related posts