నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమానికి టెక్ మహేంద్ర ఫౌండేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుందని సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. జంట నగరాలలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం టెక్ మహేంద్ర ఫౌండేషన్ సహకారంతో నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన తెలియజేశారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు వారి విద్యార్హాతలను బట్టి నగరంలోని పలు ప్రముఖ సస్ంథలలో ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని, ఆసక్తి అర్హత గల అభ్యర్ధులు అక్టోబర్ 20వ తేదీ లోపు తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9515665095, 9100330378 ఫోన్‌లలో సంప్రదించాలని కోరారు.