వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు రెండు మూడు జిల్లాల్లో ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళ వారం జగన్ తన ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. ఎన్నికల వ్యూహంపై ఆయన మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమై చర్చిస్తారు.
బుధవారం తిరిగి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. 3వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు.బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, మధ్యాహ్నం 3.30 గంటలకు కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్ ప్రసంగిస్తారని వైసీపీ నేతలు తెలిపారు.
భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ముషారఫ్