క్రికెట్ అభిమానులకు వీరేంద్ర సెహ్వాగ్… వీరు గా సుపరిచితులే. మైదానంలో ఉన్నంత సేపు పరుగుల వరదను పారించే ఆటగాళ్లలో ఒకరిగా సెహ్వాగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1999 లో తొలిఅవకాశం వచ్చింది. 2001 వరకు తనను తాను నిరూపించుకోలేకపోయారు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తొలిసారిగా అర్ధసెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఓపెనర్ టెండూల్కర్ స్థానంలో అడుగుపెట్టి వరసగా పరుగుల వరదను పారించారు.
టెస్ట్ క్రికెట్ లో త్రిబుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా సెహ్వాగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా సెహ్వాగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తం వన్డేల్లో 251 మ్యాచ్ లు ఆడిన సెహ్వాగ్ 8273 పరుగులు చేశారు. టెస్ట్ విషయానికి వస్తే 103 టెస్టుల్లో 49.34 సగటున 8586 పరుగులు చేశారు. బ్యాట్ తోనే కాకుండా సెహ్వాగ్ బాల్ తోనూ మెరుపులు మెరిపించాడు. వన్డేల్లో 96 వికెట్లు, టెస్ట్ మ్యాచ్ లలో 40 వికెట్లు తీసుకున్నారు సెహ్వాగ్. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో సెహ్వాగ్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు.