telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కేంద్ర పోర్టుల శాఖ మంత్రిని కలిసిన గౌతమ్ రెడ్డి..

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి  గౌతమ్ రెడ్డి, రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా. కేంద్ర ఓడరేవులు, పోర్టుల శాఖ సహాయ మంత్రి మనసుఖ్ మాండవీయను కలిశారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ… ఏపీలో నాలుగు ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణానికి 50 శాతం నిధులు ఇచ్చేందుకు మంత్రి హామీ ఇచ్చారు. రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టు గా అభివృద్ధి చేయాలని కోరాను. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు అని తెలిపారు. “సాగరమాల” పథకం కింద ఆగిపోయిన ప్రాజెక్టులకు వెంటనే నిధులు ఇస్తామన్నారు. భీమిలి, కాకినాడ లో ప్యాసింజర్  జెట్టీలను ప్రారంభం చేస్తామన్నారు. ”మేడ్టెక్ జోన్” ల ఎం.ఆర్.ఐ సెంటర్ ప్రారంభోత్సవానికి  వస్తానన్నారు. మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అంచనా వ్యయంలో 50 శాతం. రామాయపట్నం మేజర్ పోర్ట్ గా తీసుకోవాలని కోరాను. దానికి పారిశ్రామిక భూమి కూడా ఉంది. పోర్టు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉండాలని ప్రధాని సైతం అన్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఎస్.ఇ.జెడ్ గా మారుస్తారు. ఏది లాభదాయకమైన పోర్టో అధ్యయనం ఆధారంగా భావనపాడు, రామాయపట్నం పై  నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారు అని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts