telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్ : నితీశ్‌ కుమార్‌కు మహిళల అండ…

Nitish kumar Bihar cm

బీహార్ ఎన్నికల్లో జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌కు బీహార్ మహిళలంతా అండగా నిలుస్తున్నారు. జేడీయూను గెలిపించి ఎలాగైనా నితీశ్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. ఉదయం నుంచీ రసవత్తరంగా సాగుతున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి దూసుకెళుతోంది. నితీశ్ కుమార్ విధానాలను బీహార్‌లోని పురుష ఓటర్లు విభేదిస్తున్నా.. మహిళా ఓటర్లు మాత్రం ఆయనను ఆదరిస్తున్నారు. ఇదే విషయంపైనే ఇప్పుడు స్థానిక గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్‌డీఏ కూటమి భాగస్వాములైన బీజేపీ-జేడీయూల్లో బీజేపీయే ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉండడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే ఎక్కవ సీట్లు వచ్చినా బీజేపీ నితీశ్‌నే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తుందేమో వేచి చూడాలి. అయితే.. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ వర్గీయ చేసిన కామెంట్స్ కొంత అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభావమే మమ్మల్ని విజయతీరాలకు చేర్చిందని, ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటామని, నాయకత్వంపై కూడా సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నితీశ్‌నే తదుపరి సీఎంగా ఎంపిక చేస్తామని ఆయన చెప్పినా.. నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన ప్రకటించడం బీజేపీ ఏదో కొత్త వ్యూహం రచిస్తోందని జేడీయూ నేతల్లో అనుమానాలు రేకెత్తినట్లు తెలుస్తోంది సొంతంగానే బీజేపీ 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం.. జేడియూ కేవలం 48 స్థానాల్లోనే ముందంజలో ఉండడంతో నితీశ్‌ కుమార్‌ను మళ్లీ సీఎం చేస్తారా లేదా  అనేదానిపై క్లారిటీ గా తెలియాలి.

Related posts