దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ తక్కువ మెజారిటీ తో గెలిచింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై రఘనందన్‌రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 61302 ఓట్లు, కాంగ్రెస్ 21819 ఓట్లు, బీజేపీ 62,772 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బాంక్స్‌ల్లో ఉన్న ఓట్లల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ విజయం రఘనందన్‌రావునే వరించింది. దుబ్బాక విజయంతో బీజేపీలో నూతన ఉత్సాహం, అటు రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు జరుగనున్నాయి. ఇక దుబ్బాక విజయంతో బీజేపీ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా..దుబ్బాక ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. టీ-20 మ్యాచ్ దుబ్బాక ఫలితాలు తలపించాయి. నరాలు తెగే ఉత్కంఠతను నెలకొల్పాయి. 23 రౌండ్లు అయ్యే వరకు అందరిలోనూ ఈ ఫలితాలు ఆసక్తిని రేపాయి. మొదటి రౌండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించగా, తర్వాత తెరాస పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించింది. కానీ చివరికి విజయం బీజేపీ పార్టీనే వరించింది.
previous post
next post