telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పీసీబీకి ఏపీ హైకోర్టు షాక్…

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్… పొల్యూషన్ నిబంధనలు పాటించని కారణంగా అమరాజ బ్యాటరీ కంపెనీలు మూసేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఏమరాన్ పేరుతో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తున్న అమరరాజ కంపెనీ నుంచి వచ్చే లెడ్ వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతొందని నోటీసులో పేర్కొంది పీసీబీ. చిత్తూరు, తిరుపతి కరకంబాడీ రెండు యూనిట్లు మూసేయ్యాలని ఆదేశించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్… ఈ రెండు ప్లాంట్లలో వచ్చే లెడ్ వల్ల భవిష్యతులో ఏలూరులో వింతజబ్బు వచ్చి పడిపోయినట్టుగా జనాలు ఇబ్బందులు పడతారని హెచ్చరించింది. అయితే ఈ వోషయంలో అమర రాజా కంపెనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కంపెనీ యాజమాన్యం హైకోర్టులో కేసులు ఫైల్ చేసింది.  ఈ కేసును విచారించిన హైకోర్టు పీసీబీ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది.  విద్యుత్ ను పునరుద్ధరణ చేయాలనీ ఆదేశించింది.  జూన్ 17 వ తేదీలోగా ఆదేశాలను అమలు చేయాలనీ పీసీబీకి సూచించింది హైకోర్టు.  రిపోర్ట్ ను మళ్ళీ ఫైల్ చేయాలనీ పీసీబీని ఆదేశించింది.

Related posts