ఆర్.ఆర్ ఆర్. టీం ప్రకటన చేసినట్టుగానే ఎన్టీఆర్ సరసన నటించే బ్యూటీ పేరును ప్రకటించింది. ఈ సినిమా విడుదల కోసమే రాజమౌళి అభిమానులు ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా బాహుబలి సినిమా లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. అదేస్థాయిలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లీక్ అయిన అది వైరల్ గా మారిపోతుంది. ఈ సినిమా కోసం అటు జక్కన అభిమానులు… ఇటు మెగా అభిమానులు… మరోవైపు నందమూరి అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ చేయబోతున్నారు అనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తూనే ఉంది.
తాజాగా చిత్ర బంధం ఈ సస్పెన్స్ కు తెర దించుతూ బ్రిటిష్ బ్యూటీ ఒలివియాను ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసింది చిత్రబృందం. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేస్తామని ఇప్పుడు నుంచి మరింత వేగంగా చిత్రీకరణ జరుపుతామని తెలిపారు. ఒకే రోజు ఈ సినిమాకు సంబంధించి చాలా అప్డేట్స్ ని ప్రకటించింది చిత్రబృందం. సినిమాలు మరో ఇద్దరు ఫారెన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం వెల్లడించింది. ఐరిష్ బ్యూటీ అలిసన్ డ్యుడి కీలకపాత్రలో నటించబోతుండగా… మరో హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్సన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరు కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఆర్టీసీ భూములను తన వాళ్లకు ఇచ్చారు: విజయసాయిరెడ్డి