telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : రాహుల్, హిమజల ప్రేమాయణం… పునర్నవి రియాక్షన్

Bigg-Boss

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ సోమవారంతో తొమ్మిదో వారం మొద‌లైంది. అయితే ఎనిమిదో వారం ఇంటి నుండి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అవుతుంద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డ‌గా, అదే జ‌రిగింది. ఇప్పుడు ప్ర‌స్తుతం ప‌ది మంది ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ ఇంట్లో ఉండ‌గా, 58వ ఎపిసోడ్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ జరిగింది. ఈ నామినేషన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజా, మహేశ్‌లు ఉన్నారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీ టాస్క్‌ `క్రేజీ కాలేజీ’తో ఇంటి సభ్యులందరూ సరదాగా గడిపారు. బాబా భాస్క‌ర్, శివ‌జ్యోతిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డంతో వాటిని త‌ల‌చుకుంటూ తెగ ఏడ్చేసింది. 60వ ఎపిసోడ్‌లోను బిగ్ బాస్ కాలేజ్ హంగామా కొన‌సాగింది. బాబా భాస్క‌ర్ ల‌వ్వాల‌జీ క్లాసులు, వితికా గాస్సిపాల‌జీ క్లాసులు, వ‌రుణ్ సందేశ్ చిల్లాల‌జీ క్లాసులు చెప్పారు. అయితే బాబా భాస్క‌ర్, వితికా జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రించిన టాస్క్‌లో ఇంటి స‌భ్యులు రెండు జంటలుగా ఏర్ప‌డి ప్రేమాయ‌ణం న‌డిపించారు. వీరిలో హిమ‌జ‌, రాహుల్ జంట ప‌ర్‌ఫార్మెన్స్ జ‌డ్జెస్‌గా ఉన్న బాబా భాస్క‌ర్‌, వితికాల‌కి న‌చ్చ‌డంతో వారిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు. విజేత‌లుగా నిలిచిన రాహుల్‌, హిమ‌జ‌లు మ‌నోహ‌ర‌.. అనే పాట‌కి డ్యాన్స్ చేయ‌గా వారి ప‌ర్‌ఫార్మెన్స్‌ని ఇంటి స‌భ్యులు తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వారిద్ద‌రు హ‌గ్‌లు చేసుకోవ‌డం, హిమ‌జ ఉరుక్కుంటూ వ‌చ్చి రాహుల్‌పైకి ఎక్క‌డం వంటివి చూస్తూ పున‌ర్న‌వి తెగ న‌వ్వుతూ ఎంజాయ్ చేసింది. బాబా భాస్క‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగిన ప‌ర్‌ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్‌లో కొంత బెట‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

Related posts